స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 20 సంవత్సరాల నుంచి ఉత్తమసేవలు అందించినందుకుగాను పరిగి నీటిపారుదల శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పూడూర్ మండల్, గట్టుపల్లి గ్రామానికి చెందిన కావలి నర్సిములు కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రశంసాపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.