వికారాబాద్ జిల్లాలోని పరిగి పట్టణాన్ని భారీగా పొగ మంచు కమ్మేసింది. శనివారం తెల్లవారుజామున కురిసిన మంచుతో పరిగి పట్టణం పొగ మంచు మయమైంది. దాదాపు గంట పాటు మంచు దుప్పటిలా కప్పుకుంది. పట్టణంలోని కాలనీలలో రహదారులలో పొగ మంచు నిండుకుపోయింది. దట్టంగా కురిసిన మంచు వల్ల లారీలు, బస్సులు, వంటి పెద్ద వాహనాలతో పాటు బైకులు, స్కూటీలు, నడిపే వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.