మహమ్మదాబాద్ మండల పరిధిలోని జూలపల్లి ఉన్నత పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా వ్యవహరించి తరగతి గదిలో పాఠాలు బోధించారు. కలెక్టర్ గా సంధ్య, డీఈఓ గా రిషిధర్, ఎంఈఓ గా శివ హెచ్ఎం గా శ్రీకాంత్ మరో 17 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు.