మహ్మదాబాద్ మండలం వెంకట్ రెడ్డి గ్రామ వాసి గోటికే మల్లేష్ నిన్న హైదరాబాద్ లోని ఇబ్రహీంబాగ్ లో విద్యార్థులను తీసుకెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో టైరు పగిలింది. ఆటో అదుపు తప్పి ట్రాక్ ను ఢీకొట్టడంతో విద్యార్థులకి చిన్నచిన్న గాయాలు తగిలాయి. ఆటో డ్రైవర్ మల్లేష్ మాత్రం తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం విషయం తెలుసుకున్న రామకృష్ణ మరియు వారి అన్న రాములు హైదరాబాద్ నిమ్స్ కి వెళ్లి వాళ్లకి ఆర్థిక సహాయం 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది.