రేపు తాండూర్ ఈ షాపులు బంద్ చేయాల్సిందే!

57చూసినవారు
రేపు తాండూర్ ఈ షాపులు బంద్ చేయాల్సిందే!
తాండూరు పట్టణంలో మాంసం విక్రయాలు చేపట్టరాదని మాంసం వ్యాపారులకు మున్సిపల్ అధికారులు సూచించారు. ఈ విషయమై మంగళవారం మున్సిపల్ కమీషనర్ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం శ్రీరామ నవమిని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని మటన్, చికెన్, బీప్ మాంసం వ్యాపారులకు, రెస్టారెంట్లకు, హోటల్ వ్యాపారులకు నోటీసులు అందజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ఎవ్వరు మాంసం విక్రయాలు చేపట్టరాదని నోటీసులో స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్