రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత విక్రమ్ సారాభాయ్ 1945వ సంవత్సరంలో తిరిగి కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్‌డీ పట్టాను సాధించుకుని 1947లో తిరిగి భారత్ చేరుకున్నారు. 1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్‌ను ప్రయోగించినపుడు.. భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్‌లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు.