సాధువు వేషంలో సంచరిస్తున్న నలుగురు అనుమానితులను గ్రామస్థులు విపరీతంగా కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో చోటు చేసుకుంది. గోసాయి గంజ్‌లోని గంగాఖేడా గ్రామంలో సాధువుల వేషంలో దొంగతనాలు చేస్తున్న నలుగురు యువకులను గ్రామస్థులు చితకబాదారు. నలుగురిని ఒక్క చోటుకు చేర్చి చెప్పులతో కొట్టారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.