హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇటీవలే వీరిద్దరూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పార్టీలో చేరికపై ఊహాగానాలు వచ్చాయి. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 5న జరగనుంది. అక్టోబర్ 8న ఫలితాలు విడుదల కానున్నాయి.