ఇటీవల ప్రేమికుల ప్రవర్తన హద్దులు మీరిపోతోంది. చుట్టూ ఎవరున్నా మాకేం సంబంధం లేదన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటోంది. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రోడ్డుపై కారులో వెళ్తున ప్రేమికులు.. ఉన్నట్టుండి రూఫ్ నుంచి పైకి లేచి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో చోటు చేసుకుంది.