రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇవాళ రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. వేమగిరి- బొమ్మూరు వద్ద హైవేపై ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.