ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి మహాకుంభమేళా జరగనుంది. ఈ ప్రదేశానికున్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని బ్రహ్మదేవుడు ఈ ప్రాంతాన్ని తీర్థరాజం అని పిలిచారని చెబుతారు. దీని అర్థం అన్ని పుణ్యక్షేత్రాలకు రాజు. ఈ ప్రదేశాన్ని వేదపురాణాలు, రామాయణం, మహాభారతాలలోప్రయాగగా పేర్కొన్నారు. పద్మపురాణం ప్రకారం ప్రయాగలోని గంగ యమునా తీరంలో స్నానం చేస్తే కోట్లాది అశ్వమేధ యాగాల ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు.