రోడ్డెక్కిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు

68చూసినవారు
రోడ్డెక్కిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు రోడ్డెక్కారు. కూర్మన్నపాలెం గేట్ దగ్గర నేషనల్ హైవేపై కార్మికులు బైఠాయించారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్‌పై సానుకూల ప్రకటన చేయలేదంటూ కార్మికులు ధ్వజమెత్తారు. ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు-కార్మికుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్