స్మార్ట్‌ఫోన్‌కు ప్రజెంట్ జనం ఎలా అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే కొందరు స్మార్ట్ ఫోన్‌ను ప్రతీ నాలుగు నిమిషాలకొకసారి చెక్ చేస్తుంటారు. పదే పదే ఇలా సెల్‌ఫోన్‌ను చూడడం వల్ల మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తరచూ ఫోన్ చూడడం వల్ల మనలో జ్జాపకశక్తి క్షీణిస్తున్నట్లు అధ్యయనంలో బయటపడిందని పేర్కొంటున్నారు. ఫోన్ చూడడం కంటే పుస్తకం చదవడం మంచిదని వివరిస్తున్నారు.