ట్రంప్‌కు మద్దతుగా వివేక్‌ రామస్వామి

70చూసినవారు
ట్రంప్‌కు మద్దతుగా వివేక్‌ రామస్వామి
హాష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌కు ఇండో-అమెరికన్‌ నేత వివేక్‌ రామస్వామి మద్దతుగా నిలిచారు. ‘‘ప్రాసిక్యూటర్ ఓ రాజకీయ నాయకుడు. అతడు ట్రంప్‌ను దెబ్బతీస్తానని వాగ్దానం చేశాడు. అందుకు అనుగుణంగానే తీర్పు వచ్చింది. ట్రంప్‌ను దోషిగా పేర్కొంటూ కోర్టు తీసుకొన్న నిర్ణయం కచ్చితంగా బెడిసి కొడుతుంది’’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్