Jan 22, 2025, 08:01 IST/
అంబులెన్స్ తలుపు ఓపెన్ కాకపోవడంతో మహిళ మృతి
Jan 22, 2025, 08:01 IST
అంబులెన్స్ తలుపు తెరుచుకోకపోవడంతో మహిళ మృతి చెందిన ఘటన రాజస్థాన్‌లో జరిగింది. భిల్వారా పట్టణంలో ఓ మహిళ ఇంట్లోనే ఊరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అంబులెన్స్ డోర్లు దాదాపు 15 నిమిషాల పాటు తెరుచుకోలేదు. దీంతో మహిళ మృతి చెందింది. అంబులెన్స్ డోర్లు ఓపెన్ కాకపోవడంతోనే మహిళ మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు.