కోల్‌కతా రేప్ కేసు.. 27న విచారించనున్న హైకోర్టు

52చూసినవారు
కోల్‌కతా రేప్ కేసు.. 27న విచారించనున్న హైకోర్టు
ట్రైనీ డాక్డర్‌పై హత్యాచారం కేసును కోల్‌కతా హైకోర్టు ఈనెల 27న విచారించనుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు ఇటీవలె యావజ్జీవ శిక్ష విధించింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తితో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం సంజయ్ రాయ్‌కు ఉరిశిక్ష విధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోల్‌కతా హైకోర్టు ఈ కేసును జనవరి 27న విచారించనున్నట్లు తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్