వైద్యురాలి నిర్లక్ష్యంతో గర్భంలో శిశువు మృతి

51చూసినవారు
భూపాలపల్లి జిల్లా కాటారం మండలం చిదినేపల్లికి చెందిన హరిత పురిటి నొప్పులతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళింది. నొప్పులు ఎక్కువ కావడంతో తనకు ఆపరేషన్ చేయాలని వైద్యురాలని కోరింది. ఉమ్మనీరు మొత్తం బయటికి వచ్చిందని తెలిపినా కూడా వైద్యురాలు స్పందించలేదు. దీంతో తనను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంపాలని కోరింది. జిల్లా ఆస్పత్రికి వచ్చాక వైద్యులు శస్త్ర చికిత్స చేసి శిశు మృతి చెందినట్లు ఆదివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్