భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం కొయ్యూరు, కొండంపేట, ఇప్పలపల్లి గ్రామాలకు చెందిన 7 గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించినట్లు మంగళవారం కొయ్యురు పోలీసుల తెలిపారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్దాలకు దూరంగా ఉండాలని, ఎవరైనా గంజాయి సేవించిన, అమ్మిన చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కాటారం సీఐ నాగార్జున రావు, ఎస్సై నరేష్ లు హెచ్చరించారు.