ఆరుగ్యారెంటీల పేరుతో ప్రజలను ఆగం చేసిండ్లు. ఏడాది కావస్తున్నా ఇచ్చిన హమీలు అమలు చేయలే. పథకాల అమలులో మ్యానీఫెస్టో కమిటి చైర్మన్ విఫలం అయ్యిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. కాంగ్రెస్ ప్రజావంచన దినోత్సవాల్లో బాగంగా భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆనాడు ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామంటూ ఇంటింటికి తిరిగి సంతకాలు పెట్టి మరీ ప్రచారం చేశారన్నారు.