కాళేశ్వరాలయ హుండీ లెక్కింపు

63చూసినవారు
కాళేశ్వరాలయ హుండీ లెక్కింపు
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయ హుండీలను సోమవారం కార్యనిర్వాహణ అధికారి మారుతి ఆధ్వర్యంలో లెక్కించారు. 56 రోజులకు గాను రూ. 29,26,494 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఈవో మారుతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణాధికారి కవిత, ఆలయ సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ఎస్సై చక్రపాణి, యూనియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్