భూపాలపల్లిలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గణపురం మండల కేంద్రంలో ప్రజా పాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. గణపురం మండలం వెళ్తుర్ల పల్లి క్రాస్ నుండి గుర్రంపేట వరకు 15 కోట్ల రుపాయాలతో నిర్మించనున్న బి. టి రోడ్డు, హై లెవల్ వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గణపురంలో ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు.