భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్ పల్లి వద్ద నిర్మించిన కాలేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బరాజ్ కింద మహారాష్ట్ర వైపు భూములు కోల్పోయిన రైతుల ముంపు భూములపై మళ్ళీ జస్టిస్ గోష్ కమిషన్ విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం మహారాష్ట్రకు చెందిన రైతులు మహాదేవపూర్ లో విలేకరులతో మాట్లాడారు. మహరాష్ట్ర లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ముగిసిన తరువాత ధర్నా చేయనున్నారు.