జయశంకర్ జిల్లా రేగొండ మండలం రావులపల్లి శివారులోని పాండవుల గుట్టలను శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. పర్యటక ప్రాంతమైన పాండవుల గుట్టను మరింత అభివృద్ధి చెందేలా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. వీరి వెంట జిల్లా అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.