దాట్ల పెద్దమ్మ తల్లి గుడికి రూ.40,116 విరాళం
మహబూబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో నిర్మిస్తున్నటువంటి పెద్దమ్మ తల్లి గుడికి దాట్ల చేగువేరా యూత్ అసోసియేషన్ 40,116 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు చేగువేరా యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చేగువేరా యూత్ సభ్యులు చిదర వెంకటరమణ, చిత్తలూరి నవీన్, చిట్యాల నవీన్, గుండ గాని హరీష్, ప్రభు తదితరులు పాల్గొన్నారు.