మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలోని ఇందిరా నగర్ కాలనీలో అధికారులు సరఫరా చేస్తున్న నల్లా నీటిలో వాన పాములు, కీటకాలు ప్రత్యక్షమవుతున్నాయని గురువారం స్థానికులు వాపోయారు. డోర్నకల్ పట్టణంలో ప్రజలు చాలామంది ఇవే నీటిని తాగుతున్నారని తెలిపారు. ప్రజలు తాగే నీటి విషయంలో కనీసం జాగ్రత్తలు తీసుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, స్వచ్ఛమైన నీటిని సరపర చేయాలని కోరుతున్నారు.