రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా

50చూసినవారు
రేపు ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా
TG: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో ఆధ్వర్యంలో రిలయన్స్ నిప్పోన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ శుక్రవారం ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనుంది. కంపెనీలోని 30 లైఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పోస్టులను జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ, మాస్టర్స్ పూర్తిచేసిన 29-45 ఏళ్ల వయసు గల మహిళలకు మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్