డోర్నకల్ మండలం ముల్కలపల్లి గ్రామంలో ఆదివారం వెన్నబోయిన వీరన్న (40) మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అతను అనారోగ్యంతో బాధపడుతూ కామెర్లు అయి మృతి చెందినట్లు వారు తెలిపారు. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. దీనితో గ్రామంలో విషాదం ఛాయలు అలుముకున్నాయి.