Dec 23, 2024, 05:12 IST/
ఏపీలో నేటి నుంచి 4 రోజులపాటు భారీ వర్షాలు
Dec 23, 2024, 05:12 IST
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ డిసెంబర్ 24కి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనున్నట్లు వాతావరణవాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఈ క్రమంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.