చేర్యాల పట్టణంలో వీబీకే థియేటర్లో నవంబర్ 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు రాకింగ్ స్టార్ రాకేష్ రూపొందించిన కేశవ చంద్ర రామవత్ చిత్రాన్ని జనగామ నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచితంగా ప్రదర్శించనున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, చేర్యాల స్థానిక ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొనాలని ఇట్టి చిత్ర ప్రదర్శనను విజయవంతం చేయాలని బుధవారం తెలిపారు.