జనగామ జిల్లా కేంద్రంలోని విజయ షాపింగ్ మాల్ లో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యట్ తో ఒక్కసారిగా మంటలుచెలరేగాయి. భారీగా ఎగిసిపడ్డ మంటలతో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్ధమైంది. ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఇంకా అదుపులోకి రాని మంటలతో అగ్నిమాపక శాఖ చర్యలు. కొనసాగుతున్నాయి.