జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కొరకు భూసేకరణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జాఫర్‌గఢ్ మండలం కోనాయచలం గ్రామం వద్ద ప్రభుత్వ భూమిని ఆర్డిఓ డిఎస్ వెంకన్నతో కలిసి సందర్శించారు. సోమవారం ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అనువుగా ఉన్న స్థలాన్ని పరిశీలించి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా సర్వే నెంబర్ల వారీగా సంబంధిత అధికారులు నివేదిక త్వరితగతిన అందజేయాలన్నారు.