జనగాం పట్టణ కేంద్రంలోని శ్రీ దుర్గామాత, శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయాలను తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి సందర్శించారు. బుధవారం ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో దుర్గామాత, రేణుకా ఎల్లమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరితో పాటు ఓబీసీ చైర్మన్ లోకుంట్ల ప్రవీణ్, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు అభిగౌడ్, జాయ మల్లేష్, ప్రభాకర్, శ్రీనివాస్, పరుశరాములు దర్శించుకున్నారు.