జనగామ జిల్లా కేంద్రంలోని వినాయక బార్ వెనకాల శనివారం రాత్రి వెంకన్న అనే వ్యక్తి ని బండ రాయితో కొట్టి చంపి అతని స్నేహితులు నిప్పంటించారు. మృతుడు జనగామ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ లో కోతితో జీవనం కొనసాగిస్తున్నారు. వెంకన్న ను మూడు వందల రూపాయలు ఇవ్వాలని స్నేహితులు అడిగారు. ఇవ్వకపోవడంతో వెంకన్నతో తన స్నేహితులకు మధ్య
ఘర్షణ ముదరడంతో వెంకన్న బండరాయి తో మోది హత్య చేశారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.