జనగామ జిల్లా కేంద్రంలోని ఏబివి ప్రభుత్వ డిగ్రీ కలశాలలో జూనియర్ అసిస్టెంట్ పై దాడి చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని బుధవారం పట్టుకుని అరెస్టు చేశారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి అతని వద్ద నుండి 77 వేల విలువల 10 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మహబూబాబాద్ జిల్లా బక్కరుప్పుల గ్రామానికి చెందిన కేలోత్ సాయి కృష్ణగా ఏసిపి పార్థసారథి వెల్లడించారు. అన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిపారు.