జనగామ: పెంచుకున్న కోళ్లను చంపారని మహిళ ఫిర్యాదు

72చూసినవారు
తాను పెంచుకున్న కోళ్లను మందు పెట్టి చంపారంటూ ఓ మహిళ జనగామ కలెక్టరేట్లో శుక్రవారం ఫిర్యాదు చేసింది. లింగాలగణపురం మండలం నెల్లుట్లకు చెందిన శ్రీవాణి గాయత్రి అనే మహిళ తన ఇంట్లో పదుల సంఖ్యలో కోళ్లను పెంచుతోంది. తానంటే గిట్టని పక్కింటి వాళ్లు కొందరు మందు పెట్టి చంపారని ఆవేదన చెందింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్ ఉన్నతాధికారులకు విన్నవించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్