జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని కస్తూరీభా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. గురువారం ఈ సందర్భంగా మెనూకి సరిపడా వంట సామాను ఉందా లేదా అని, వంట చేసే గదిని పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేసారు. అనంతరం మెనూ ప్రకారం ఆహరం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను కలెక్టర్ వాకబు చేసి సంబంధిత సిబ్బందికి తగిన సూచనలు చేశారు.