పాలకుర్తి: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థులు

80చూసినవారు
పాలకుర్తి: రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన గిరిజన విద్యార్థులు
జనగాం జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామ తెలంగాణ గిరిజన గురుకుల బాలికల కళాశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని బుధవారం ప్రిన్సిపాల్ రేణుక తెలిపారు. జనగామ ధర్మకంచ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి టెన్నిస్- వాలీబాల్ ఆటల పోటీల్లో విజేతలై రాష్ట్ర స్థాయి పోటీలకు నవీన, నికిత, వెన్నెల, ఆరాధ్య, లక్ష్మీప్రసన్న, సాత్విక, ఐశ్వర్య, శివాని, వనితలు ఎంపికైనట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్