ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నం త్వరలో నెరవేరనుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. మామునూరు ఎయిర్ పోర్టుకు మరో కీలక ముందడుగు పడిందని, ఎయిర్ పోర్ట్ విస్తరణకు అవసరమైన 253 ఎకరాల భూసేకరణ కోసం 205 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ జీవో జారీ చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం రేవంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.