వరంగల్ జిల్లా నూతన కమిటీ నియామకం
వరంగల్ జిల్లా సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం నూతన జిల్లా కార్యవర్గంను గురువారం నెక్కొండ మండల కేంద్రంలో ఎన్నుకున్నారు. కమిటీ ఎన్నికకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వీరస్వామి గౌడ్ పాల్గొని నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా సురేష్ గౌడను, మహిళా జిల్లా అధ్యక్షురాలిగా రాధిక -శ్రీనివాస్ గౌడ్, యూత్ అధ్యక్షుడిగా గణేష్ గౌడ్ లను నియమించారు.