జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండల కేంద్రంలోని రంగాపురం గ్రామానికి చెందిన నల్ల మాస బిక్షపతి, శోభ కుమారుడు సందీప్ అనే యువకుడు మంగళవారం అర్ధరాత్రి వారి ఇంటి పక్కన ఉన్న వేప చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఇది తెలుసుకున్న కొడకండ్ల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చింత రాజు మృతదేహాన్ని పరిశీలన నిమిత్తం జనగామ ఏరియా హాస్పిటల్ లోని మార్చురీకి పంపించారు.