Feb 25, 2025, 11:02 IST/
కాంగ్రెస్ ఎమ్మెల్యేపై దాడికి యత్నం!
Feb 25, 2025, 11:02 IST
TG: తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు ఎదురుదెబ్బ తగిలింది. సదర్సాపురం గ్రామంలో గోదావరి జలాలకు పూజలు చేసేందుకు వచ్చిన ఆయనపై గ్రామస్థులు అడ్డుకున్నారు. ఇసుక మాఫియాను అంతం చేస్తానని హామీ ఇచ్చి, ఎందుకు ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకదశలో సదర్సాపురం గ్రామస్థులు ఎమ్మెల్యేను చుట్టుముట్టి దాడికి యత్నించినట్లు తెలుస్తుంది. దీంతో వెంటనే సామేలు అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం.