AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆ పార్టీకి మరో భారీ షాక్ తగలనుంది. 20 మంది వైసీపీ కార్పొరేటర్లు, ముగ్గురు కోఆప్షన్ సభ్యులు ఆ పార్టీకి రాజీనామా చేసి జనసేన తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు వారితో మాజీ మంత్రి బాలినేనితో చర్చలు జరిపారు. త్వరలో డిప్యూటీ సీఎం పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.