వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది?: మంత్రి లోకేష్

61చూసినవారు
వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుంది?: మంత్రి లోకేష్
వైసీపీ ప్రతిపక్ష హోదా ఎలా అడుగుతుందని మంత్రి నారా లోకేష్ ప్రశ్నించారు. మంగళవారం అమరావతిలోని ఏపీ అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సభలో పార్లమెంట్‌, అసెంబ్లీ నిబంధనలను లోకేష్ చదివి వినిపించారు. మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతం ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని లోకేష్ పేర్కొన్నారు. వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌ రెడ్డికి పార్లమెంట్‌, అసెంబ్లీ అంటే లెక్కలేదని మంత్రి లోకేష్‌ విమర్శించారు.

సంబంధిత పోస్ట్