మహాశివరాత్రి సమీపిస్తున్న తరుణంలో ఓ యువకుడు తన కళాకృతిని ప్రదర్శించాడు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన ఆడెపు రజినీకాంత్ అనే సూక్ష్మ కళాకారుడు.. చాక్ పీస్ లతో 109 శివలింగాలను తయారు చేశాడు. సుమారు 10 గంటలపాట శ్రమించి 109 శివలింగాలను తయారుచేసినట్లు రజినీకాంత్ తెలిపారు. సూక్ష్మ కళాకారుని కళాసృష్టిని పలువులు అభినందిస్తున్నారు.