SLBC టన్నెల్ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మంగళవారం ఎస్‌ఎల్‌బీసీ వద్ద కొనసాగుతున్న సహాయ చర్యలను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, జూపల్లి పర్యవేక్షించారు. వందమీటర్ల పూడిక తర్వాత 6 అడుగుల ఎత్తులో మట్టి, రాళ్లతో పూడిక ఉంది. దాంతో ఎండోస్కోపిక్ రోబోటిక్ పుష్ కెమెరాలను తీసుకెళ్లినా ఫలితం దక్కలేదు. దెబ్బతిన్న టీబీఎం నుంచి ముందుకెళ్లలేక పుష్ కెమెరాల బృందాలు వెనుదిరిగాయి.