వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమైందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళవారం ఏపీ అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. 'రాష్ట్ర పునర్నిర్మాణం చేయాలనే లక్ష్యంతో కలిసి పోటీచేశాం. డబుల్ ఇంజిన్ సర్కార్ లేకుంటే రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయలేమని భావించాం రాష్ట్రాభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తున్న కేంద్రానికి ధన్యవాదాలు. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నాం.' అని అన్నారు.