పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరుపై నేపాల్‌లో ఓ ఊరే ఉంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే ఓ తెలుగు మోటో వ్లాగర్ నేపాల్ పర్యటనలో ఉండగా అతనికి ఈ విలేజ్ కనిపించింది. దీంతో డార్లింగ్ పేరుతో ఊరు ఉందంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.