మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అటల్ బిహారి వాజపేయి వర్ధంతి సందర్భంగా బీజెపీ నాయకులు రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాజపేయి ప్రజల్లో నుండి వచ్చిన మనిషిగా రాజకీయాల్లో దృఢ సంకల్పం కలిగిన వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పూసల శ్రీమాన్, కుమార్, కిన్నెర యాదగిరి, ఫైండ్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.