ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ సీనియర్ నాయకుడు ఎనగంటి భద్రయ్య విష జ్వరంతో హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్లో మృతి చెందాడు. భద్రయ్య మూడు రోజుల నుండి తీవ్ర జ్వరంతో బాధపడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ హాస్పిటల్ లో చేర్పించి వైద్యం అందిస్తుండగా మంగళవారం మృతి చెందారు. భద్రయ్య మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.