మేడారంలో అభ్యుదయ యువజన సంఘం సమావేశం

60చూసినవారు
మేడారంలో అభ్యుదయ యువజన సంఘం సమావేశం
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో అభ్యుదయ యువజన సంఘం ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాల యువజన సంఘాల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండలంలోని 25 గ్రామాల అధ్యక్షులు, కార్యదర్శులు హాజరయ్యారు. ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకుడు గణేశ్ హాజరై మాట్లాడారు. ఆదివాసీ యువత రాజ్యాంగం హక్కుల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. గ్రామాల్లో సమస్యలు వస్తే పరిష్కారం కోసం ఉమ్మడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్